ETV Bharat / state

బిందెలో ఇరుక్కుపోయిన బాలుడి తల.. నొప్పికి విలవిల - karimnagar district latest news

ఓ 5 ఏళ్ల బాలుడు.. బిందెతో ఆడుకుంటున్నాడు. ఇంతలో స్టీల్​ బిందెలో తల ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా... ఆ బిందె నుంచి తల బయటకు రాలేదు. దీనితో ఏం చేశారంటే..?

head struck in steel pot
head struck in steel pot
author img

By

Published : May 13, 2021, 9:58 AM IST

Updated : May 13, 2021, 10:27 AM IST

కరీంనగర్​ జిల్లా కేశవపట్నంలో ప్రాణాంతక ఘటన చోటుచేసుకుంది. ఓ అయిదేళ్ల బాలుడు స్టీల్​ బిందెతో ఆడుకుంటుండగా... తల బిందెలో ఇరుక్కుపోయింది. ఎంత ప్రయత్నించినా బాలుడి తల బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ బిందెను తొలగించెందుకు విశ్వప్రయత్నం చేశారు. ఓవైపు చిన్నారి ఏడుపు... మరోవైపు తీసేందుకు ఎంత ప్రయత్నించినా.. రాకపోవడం... తల్లిదండ్రులు తీవ్ర భయానికి గురయ్యారు.

బిందెలో తల ఇరుక్కుపోయి.. విలవిలాడిన బాలుడు!!

అన్ని యత్నాల అనంతరం స్టీల్​ను కత్తిరించే యత్నంతో బిందెను తొలగించారు. బిందెను కత్తిరిస్తున్న క్రమంలో కళ్లలో ముక్కలు పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు రెండు గంటల పాటు కష్టపడి.. బిందెను కత్తిరించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి: ఇంటింటి సర్వేలో వెలుగులోకి వచ్చిన కరోనా బాధితులు

Last Updated : May 13, 2021, 10:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.