4 Babies died in Maternal Child Health Centre in Karimnagar district : ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఆస్పత్రులు కూడా సకల సౌకర్యాలతో కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే చాలా సౌకర్యాలు ఉన్నప్పటికీ సిబ్బంది జాప్యంతో చాలా మంది పసికందులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఘటనే కరీంనగర్‌లోని మాతాశిశు కేంద్రంలో జరిగింది. జిల్లాలోని మాతాశిశు కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో నలుగురు నవజాత శిశువులు మృతి చెందారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సకల సౌకర్యాలు కల్పించామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ఉంటే ప్రజలు నమ్మి ఆసుపత్రికి వస్తే మృత శిశువులను చేతుల్లో పెడుతున్నారని బాధిత బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
13రోజులలో నలుగురు శిశువులు మృతి: కరీంనగర్ జిల్లా ప్రభుత్వ మాతా శిశువు ఆరోగ్య కేంద్రంలో వరుస శిశు మరణాలు ఆందోళనలకు దారితీస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే 13రోజులలో నలుగురు నవజాత శిశువులు మృతి చెందారని బంధువులు ఆస్పత్రి ముందు నిరసన చేపట్టారు. చిగురుమామిడి మండలం బోయిన్‌పల్లికి చెందిన సునీత ప్రసూతి కోసం కరీంనగర్‌లోని మాాతాశిశు కేంద్రంలో చేరింది. నిన్న రాత్రి 2గంటల సమయంలో రక్తస్రావం అధికంగా కావటంతో ఆమె బంధువులు వైద్యురాలిని సంప్రదించగా నిర్లక్ష్య సమాధానమిచ్చారు. బాబు గుండె చప్పుడు ఆగిపోవటంతో ఈరోజు ఉదయం వైద్యులు శస్త్రచికిత్స చేసి మృత శిశువును బయటకు తీశారు.
మృతికి కారణాలు లేవు: శిశువు మృతికి గల కారణాలు వివరించలేదు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాబు చనిపోయాడని ఆరోపిసస్తూ ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ముందు బైఠాయించారు. అనంతరం ప్రజావాణిలో ఫిర్యాదు చేయటానికి కలెక్టర్ కార్యాలయానికి మృత శిశువుతో కుటుంబ సభ్యులు చేరుకోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారికి మద్దతుగా జిల్లా కార్యవర్గ సభ్యుడు యుగేందర్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. వారం రోజుల కిందటే చొప్పదండి మండలానికి చెందిన శ్వేత శిశువు మృతిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ వైద్యులలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
"మొదట్లో పెరిగి ప్రాబ్లమై బేబీ కడుపులోనే మరణించిందని చెప్పారు. ఆపరేషన్ చేసి తీసిన తర్వాత మోషన్ మింగి చనిపోయిందని చెబుతున్నారు."_శిశువు తండ్రి
"మాతాశిశు కేంద్రంలో డెలివరికి వస్తే ప్రాణాలు పోతున్నా వైద్యులు కనీసం పట్టించుకోవడం లేదు. డెలివరీకి వస్తే వాళ్లు బతుకుతారా లేదా అనే అనుమానం కలుగుతోంది. అక్కడి ఇన్ఛార్జ్లను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ విషయంపై కలెక్టర్ పూర్తిగా విచారణ జరపాలని కోరుతున్నాం."_యుగేందర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు
ఇవీ చదవండి: