కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్మ ఫంక్షన్ హాల్లో గురువారం జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్, హన్మంత్ షిండే, జాజుల సురేందర్, రాజేశ్వర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కొన్ని గ్రామాల్లో పింఛన్ డబ్బులను రాత్రి 7 గంటల నుంచి ఒంటి గంట వరకు పంచుతున్నారని... ఇక నుంచి అలా రాత్రుళ్లు పంచకుండా చూడాలని కోరారు. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి కామారెడ్డి ప్రజల కన్నీళ్లు తుడవాలని కోరారు.
ఇవీ చూడండి: బంపర్ ఆఫర్: పాత బంగారానికి... కొత్త ఆభరణాలు