కరోనా మహమ్మారి ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. గ్రామాల్లో వైరస్ విస్తరిస్తుండటం వల్ల గ్రామ దేవతలే కోపానికి గురవుతున్నారని ప్రజలు నమ్ముతున్నారు. ఊళ్లల్లో ముడుపులు కడుతూ గ్రామం వదిలి వనభోజనాలకు వెళ్తున్నారు.
కామారెడ్డి జిల్లా బీబీపేటలో సైతం వనభోజనాలకు వెళ్లారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గాలని గ్రామస్థులు ముడుపు కట్టి గ్రామ శివారులో వనభోజనాలకు వెళ్లారు. గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఊరిలో ప్రతీ ఇంటికి తాళం వేసి వనభోజనాల్లో పాల్గొన్నారు. డప్పు చప్పుళ్లతో గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు.