కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం బేతాళస్వామి కాలనీలో నివాసం ఉంటున్న కుర్మా సంగమేశ్వర్ ఇంట్లో చోరీ జరిగింది. హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న సంగమేశ్వర్ తన ఇంటికి వేసిన తాళం ఊడిపోవటం చూసి ఆందోళన చెందారు. గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఒక లక్షా పదివేల నగదు, రెండున్నర తులాల బంగారం, వెండి అపహరించినట్లు పట్టణ సీఐ మహేష్ గౌడ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి : వెనక్కి తగ్గమంటున్న ప్రభుత్వం, కార్మిక సంఘాలు...