వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద కాలినడకన వెళ్తున్న వలస కూలీలను పోలీసులు అడ్డగిస్తున్నారు. వీరిని ఎక్కడి నుంచి వస్తున్నారని ఆరా తీయగా.. చెన్నై, హైదరాబాద్ నుంచి వస్తున్నట్లు చెబుతున్నారు. వారి స్వస్థలాలైన భోపాల్, ఆగ్రా, హరియాణా, రాజస్థాన్ వెళ్తున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా నేపథ్యంలో వందలాది వలస కూలీలు కాలినడకన సొంత ఊళ్లకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కొందరు కంటైనర్లలో వెళ్తూ.. పోలీసులకు పట్టుబడుతున్నారు. కామారెడ్డి జిల్లా టెక్రియల్ బైపాస్ వద్ద పోలీసులు తనిఖీ చేపట్టగా కంటైనర్లో సుమారు 100 మంది కార్మికులు వెళ్తుండగా పోలీసులు అడ్డగించారు. వీరంతా హైదరాబాద్‌లోని గండి మైసమ్మ ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ కారణంగా పనిలేదని అందుకే తమ గ్రామాలకు వెళ్తున్నట్లు కూలీలు తెలిపారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరుకు 'పీఎం కేర్స్' నిధికి భారీగా విరాళాలు