కామారెడ్డి మండలం రాఘవపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గోలముడి సోమయ్య అనే వ్యక్తి ఇంట్లో తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల సోమయ్య, అతని ఇద్దరు కుమారులు, కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు క్షతగాత్రులను వెంటనే జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడం వల్ల మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. సోమయ్య గ్రామ శివారులో గల ఇటుకల బట్టీలో పనిచేస్తారు.
ఇవీ చూడండి: కరోనాపై పోరులో ప్రజలకు రేపు మోదీ వీడియో సందేశం