కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని గ్రామాల్లో ప్రాదేశిక ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. సోమార్‌పేట, లచ్చాపేట, మాచారెడ్డి, ఇసాయిపేట తదితర గ్రామాల్లో పర్యటించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే గ్రామాలన్నీ సస్యశ్యామలమవుతాయని షబ్బీర్‌అలీ తెలిపారు. ఆయనతోపాటు జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మధన్‌మోహన్‌రావు, మాచారెడ్డి జడ్పీటీసీ అభ్యర్థి పల్లె రమేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: బ్యాలెట్ పత్రంపై వేలిముద్ర పడితే ఓటు చెల్లనట్టే