ETV Bharat / state

నేలకొరిగిన వరి పైరు.. అన్నదాత కళ్లలో కన్నీరు - heavy rain in kamareddy

ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా నేలకొరిగింది. కర్షకుల కష్టమంతా నీటిపాలవుతోంది. అకాల వర్షం అన్నదాతల పాలిట శాపమై.. వారిని నష్టాల ఊబిలోకి నెట్టేస్తోంది.

rice paddy fell on to the ground due to heavy rain
నేలకొరిగిన వరి పైరు
author img

By

Published : Oct 13, 2020, 12:21 PM IST

కామారెడ్డి జిల్లాలో బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. బీర్కూర్ మండలంలోని బీర్కూర్, ప్రకాశ్​రావు క్యాంపు గ్రామాల్లో వరి పంట నేలకొరిగింది.

మంజీరా పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షానికి వరి గింజలు నేలరాలాయి. ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయానికి నేలకొరిగిందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.