ఫోటో.. మనిషి భావాలకు, ఆలోచనలకు ప్రతీక. మనిషి మాట్లాడలేని, మాట్లాడడానికి సాధ్యం కాని ఎన్నో భావాలను ఒక ఫొటో పలికిస్తుంది. మనిషి అనుభవించిన తీపిగుర్తులు, అనుభూతులు పదిలంగా దాచుకునే మధుర స్మృతులను మళ్లీ మళ్లీ అనుభవించేలా చేసేది ఫొటోగ్రఫీ. ఆగష్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఫొటోగ్రఫీ పితామహుడికి మండల కేంద్రంలోని ఫొటోగ్రాఫర్లు నివాళులు అర్పించారు. పురాతన కాలంలో చిత్రం గీయడంతో మొదలై ఆ తర్వాత కెమెరా రకరకాలుగా అభివృద్ధి చెందుతూ టెక్నాలజీ వేగాన్ని అందుకుంది. ప్రతి మనిషిని మానసిక ఉల్లాసానికి, సామాజిక పరిపక్వతకు, మనోవికాసానికి, ఆలోచనలకు, సృజనాత్మకకు ఈ ఫోటోగ్రఫీ కారణం అని వారు తెలిపారు.
ఇదీ చూడండి: కొత్త విద్యా విధానం... కొన్ని సవాళ్లు!