కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నిజాంసాగర్ జలాశయానికి వరద కొనసాగుతోంది. ఎగువ నుంచి 63,455 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 9 గేట్లు ఎత్తి 64,836 క్యూసెక్కుల నీటిని మంజీరా నదిలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
- ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు గాను... ప్రస్తుతం 1,403.5 అడుగులకు చేరింది.
- జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 17.802 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 15.77 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇదీ చదవండి: ఆక్రమణలు, నిర్లక్ష్యమే... వరద ముంపునకు కారణం