కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట మిషన్ భగీరథ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా జిల్లాలో పని చేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లు, జూనియర్ అసిస్టెంట్లు మొత్తం 20 మందిని తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ శరత్ కుమార్ను కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రాష్ట్రంలో 709 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం సరికాదన్నారు.
నాలుగేళ్లుగా తాము మిషన్ భగీరథలో పని చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో తమను ఉద్యోగం నుంచి తొలగించడం వల్ల తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తమపై ఆధారపడి ఉన్న తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తమకు 5 నెలల వేతనాలు పెండింగ్లో ఉన్నాయని.. వాటిని వెంటనే చెల్లించి తమకు ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి: వరంగల్ మహా నగరమైనా అభివృద్ధిలో ఎందుకు వెనకబడుతోంది!