కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని తిప్పారం, భూర్గుల్, బొప్పాజీవాడి గ్రామాల్లో చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత సంచారం ఎక్కువవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. పది రోజులుగా మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

పొలాల్లో చిరుత తిరుగుతుండగా చూశామని స్థానికులు తెలిపారు. పొలాలకు వెళ్ళేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. చిరుత కోసం పలుచోట్ల బోన్లు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: టైర్ల కంపెనీలో భారీ అగ్నిప్రమాదం