కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి చిన్న నాగేంద్రయ్య పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. నాగేంద్రయ్య దంపతులను పూలమాల, శాలువాతో సత్కరించారు.
వ్యవసాయ అధికారిగా నాగేంద్రయ్య సేవలు ప్రశంసనీయమని పోచారం కొనియాడారు. చాలా ఓపికతో అప్పగించిన బాధ్యతలు సకాలంలో పూర్తి చేసి ఎన్నో అవార్డులు పొందినట్టు పేర్కొన్నారు. నాగేంద్రయ్య పదవీ విరమణ విషయం తెలిసి... కొనసాగించాలని జిల్లా రైతులు విజ్ఞప్తి చేసినట్లు పోచారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ కుమార్, కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జూన్ 2న తెలంగాణ డిమాండ్స్ డే: సీపీఐ కార్యదర్శి భూమన్న