కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రాజెక్టులోకి 930 క్యూసెక్కుల మేర స్వల్ప ప్రవాహం కొనసాగుతోంది.
![నిండు కుండలా పోచారం... అలుగు పోస్తున్న జలాశయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8513410_729_8513410_1598079275365.png)
నిండు కుండలా పోచారం...
కొద్ది రోజులుగా స్థానికంగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి మట్టం పూర్థిస్థాయికి చేరింది. ఈ సందర్భంగా డ్యాం గేట్లపై నుంచి అలుగు పోస్తోంది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ప్రధాన కాలువ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. 104 క్యూసెక్కుల నీరు జలాశయం ఆయకట్టు పరిధిలోని పంట పొలాలకు వెళ్తోంది.
![నిండు కుండలా పోచారం... అలుగు పోస్తున్న జలాశయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/tg-nzb-01-22-alugu-paaruthunna-pocharam-av-ts10111_22082020083748_2208f_1598065668_632.jpg)