ETV Bharat / state

గుండెపోటుతో గల్ఫ్​లో కామారెడ్డి జిల్లా వాసి మృతి - కామారెడ్డి జిల్లా

కుమార్తెల వివాహాల కోసం సంపాదించేందుకు బయటి దేశం వెళ్లాడు. 20 ఏళ్లు బాగానే పనిచేశాడు. గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించాడు. అతన్నే నమ్ముకున్న కుటుంబం దిక్కులేనిది అయింది. ఇంటి పెద్ద దిక్కు మరణంతో కుటుంబ సభ్యుల రోదనలు ఆకాశాన్నంటాయి.

గల్ఫ్​లో కామారెడ్డి జిల్లా వాసి గుండెపోటుతో మృతి

author img

By

Published : Feb 20, 2020, 7:32 PM IST

కుమార్తెల వివాహాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు బయట దేశానికి వెళ్ళిన కామారెడ్డి జిల్లా వాసి శంకరయ్య అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. జిల్లాలోని లింగాపూర్​కు చెందిన 58 ఏళ్ల వడ్ల శంకరయ్య 20 సంవత్సరాల క్రితం గల్ఫ్​ వెళ్లాడని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం తన గదిలో గుండెపోటుతో మరణించినట్లు పేర్కొన్నారు.

మృతుడికి నలుగురు కుమార్తెలు ఉన్నారు. వారికోసం మొత్తం 11 లక్షల అప్పు ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని.. వీలైనంత త్వరగా మృతదేహాన్ని తెప్పించాలని కోరారు. స్థానికులు ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​ను కలిసి శంకరయ్య కుటుంబ సభ్యుల బాధను తెలియజేశారు. ఆయన సానుకూలంగా స్పందించి.. మంత్రి కేటీఆర్​ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.

గల్ఫ్​లో కామారెడ్డి జిల్లా వాసి గుండెపోటుతో మృతి

ఇవీ చూడండి: మహాశివరాత్రి స్పెషల్: వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.