ETV Bharat / state

గోమయ గణపయ్య... పర్యావరణానికి మేలయ్య - గోమయ గణపయ్య... పర్యావరణానికి మేలయ్య

గోసంరక్షణే ధ్యేయంగా గోశాల ఏర్పాటు చేసి గోమయంతో పర్యావరణహితమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడకు చెందిన శ్రీనివాస్​. గణేశ్​ చతుర్థి పురస్కరించుకుని ఇప్పుడు పర్యావరణహిత గోమయ గణపతులను తయారుచేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

గోమయ గణపయ్య... పర్యావరణానికి మేలయ్య
author img

By

Published : Aug 25, 2019, 5:11 PM IST

గోమయ గణపయ్య... పర్యావరణానికి మేలయ్య

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన శ్రీనివాస్​ వృత్తిరీత్యా న్యాయవాది. గోవులను రక్షించేందుకు ప్రత్యేకంగా గోశాలను ఏర్పాటు చేసి ఆవులను సంరక్షిస్తున్నాడు. వినాయక చవితి పురస్కరించుకుని పర్యావరణానికి హితంగా ఉండేలా ఆవు పేడతో గణేశ్​ ప్రతిమలను తయారు చేయడం ప్రారంభించాడు. ఆ ప్రతిమలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాలుష్య రహిత పర్యావరణంపై చైతన్యం కలిగిస్తున్నాడు.

గోమయ ఉత్పత్తులు

గోసంరక్షణతో పాటు గోమయంతో పలు రకాల ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నాడు. ఇప్పటివరకు టోపి, ఇంట్లో అలంకరణ వస్తువులు, రేడియేషన్​ స్టిక్కర్లు, వెంకటేశ్వర స్వామి, హనుమాన్ విగ్రహాలు రూపొందించారు. కాలుష్య రహిత సమాజం కోసం ప్రజల్లో మరింత అవగాహన తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని శ్రీనివాస్​ అన్నారు.

కాలుష్యరహిత బాన్సువాడ

ఇతర గ్రామాల ప్రజలు ఇక్కడికి వచ్చి గోమయ గణపతులను కొనుగోలు చేస్తున్నారు. కొందరు ఇక్కడి నుంచి ప్రతిమలు తీసుకువెళ్లి తమ ఊళ్లలో ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. పర్యావరణహితమైన విగ్రహాలు వినియోగించి బాన్సువాడను కాలుష్యరహిత పట్టణంగా తీర్చిదిద్దుతామని స్థానికులు చెబుతున్నారు.

Intro:tg_nzb_05_21_gommayam_tho_thayaru_chesina_vinayaka_vighralu_pkg_ts10122 గోమాయం తో తయారు చేసిన వినాయక విగ్రహాలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణం నికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు వృత్తిరీత్యా న్యాయవాది కానీ అతడు గోసంరక్షణ కోసం ప్రత్యేకంగా ఒక్క గోశాలను ఏర్పాటు చేసి ఆవులను పెంచి అవులను సంరక్షణ మొదలు పెట్టాడు అలా ఆయనకు దీనితో పాటు ఒక్క ఆలోచన వచ్చింది కాలుష్యం అవుతున్న వాతావరణం రసాయన పూరిత మైన వినాయక లను బదులుగా అవుతో పెడ తో చేసిన వినాయక ప్రతిమలను తయారు చేసి ప్రజలలో తీసుకెళ్లి ప్రజలలో చైతన్యం కలిగించి కలుషిత రహిత వాతావరణం కోసం అవుపెడ తో తయారూ చేసిన వినాయక ప్రతిమలును చేసు అమ్మడం మొదలుపెట్టాడు కేవలం 100 రూపాయల కు అవు పేడ తో చేసిన వినాయక విగ్రహంని అమ్ముతూ అట్టు గోసంరక్షణ చేస్తూ ఆవులను పెంచుతూ ఆవు పెడ తో వినాయక విగ్రహాలు కాకుండా చరవాణి పెట్టుకునేందుకు మరియు ఆవు పేడ తో చేసిన టోపి అలాగే ఇంట్లో అలకంరణ కోసం పెట్టునందుకు పులజడి గృహోపకరణ వస్తువులు మొబైల్ రేడియేషన్ తగ్గించేందుకు మొబైల్ ఫోన్కు వీలుగా అతికించి ఎందుకు ఆవు పేడతో చేసిన రేడియేషన్ స్టిక్కర్లను తయారుచేసి అలాగే వినాయక ప్రతిమలతో పాటు వెంకటేశ్వర స్వామి విగ్రహాలను మరియు చిన్న చిన్న ఆంజనేయస్వామి వినాయక ప్రతిమలను లాకెట్టు గా తయారు చేసినాడు ఇది ఇలా ఉండగా సమాజం కోసం ప్రతి ఒక్కరిలో చైతన్యం తీసుకురావడం కోసం కాలుష్య రహిత వాతావరణం సంరక్షణ కోసం పనిని చేస్తున్నాం అని తెలియజేశాడు వారి కుటుంబ సభ్యులు మాత్రమే అంటున్నారు ఇలా ఉండగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ పర్యావరణ సంరక్షణ కోసం కాలుష్య రహిత సమాజం కోసం చైతన్యం తీసుకురావడం కోసం కృషి చేస్తానని తెలిపాడు ఈయన వృత్తిరీత్యా న్యాయవాది అయిన పర్యావరణ సంరక్షణ కోసం ఇక ముందు ఎంతో పాటుపడతానని అలాగే ప్రజల్లో కూడా నైపుణ్యత తీసుకురావడం కోసం కృషి చేస్తారని తెలియజేశాడు బైట్ .1 1. శ్రీనివాస్ న్యాయవాది గోమాయం తో చేసిన వినాయక ప్రతిమల చేసే నిర్వాకుడు బైట్.2 2.శంకర్ యాదవ్ బైట్.3 ప్రవీణ్ కుమార్ బైట్.4 కాశిరం

Body:నర్సింలు బాన్స్వాడ

Conclusion:9676836213
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.