తాము అడిగిన సమాచారం ఇవ్వడంలో కమిషనర్ నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట పలువురు భాజపా కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయంలోకి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
మున్సిపల్ కార్యాలయంలో ఎంతమంది కార్మికులు పని చేస్తున్నారు, మున్సిపాలిటీకి వచ్చిన నిధులెన్ని, పట్టణ ప్రగతిలో వార్డుల వారీగా చేసిన ఖర్చుల వివరాలు ఇవ్వాలని కమిషనర్‌ను అడిగితే.. కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కౌన్సిలర్లు ఆరోపించారు. తాము కౌన్సిలర్లమన్న విషయమే మున్సిపల్ అధికారులకు తెలియదని.. కార్యాలయానికి వచ్చిన ప్రతిసారీ మేము కౌన్సిలర్లమని చెప్పుకోవాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో కౌన్సిలర్లు ప్రవీణ్, శ్రీనివాస్, రవి, శ్రీకాంత్, నరేందర్, సుజిత, మానస పాల్గొన్నారు.
ఇదీ చూడండి: మహిళా అభిమానులూ నా భార్యతో జాగ్రత్త