కామారెడ్డి జిల్లా బాన్సువాడలో బేతాల స్వామి ఉత్సవాలు నిరాడంబరంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి అనంతరం వచ్చే రెండో గురువారం సందర్భంగా జాతర వేడుకలు మూడు రోజులు పాటు కొనసాగుతాయి. కరోనా వైరస్ ప్రభావం వల్ల జాతర వేడుకలు సాదా సీదాగా జరుపుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించి స్వామిని దర్శించుకుంటున్నారు. ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. వచ్చే ఏడాదికి కరోనా మహమ్మారి అంతం కావాలని... జాతర ఎప్పటిలాగే వైభవంగా జరగాలని హనుమాన్ను కోరుకున్నట్లు వెల్లడించారు.
నిరాడంబరంగా బేతాల స్వామి జాతర
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఏటా హనుమాన్ జాతర వైభవంగా జరిగేది. ఈసారి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా హంగు ఆర్బాటాలు లేకుండా ఆనవాయితీ ప్రకారం జరుపుకున్నారు.