ఎన్నికల్లో ఓటు వేయని కారణంతో తమ పింఛన్లను తొలగించారని ఆరోపిస్తూ.. కొంతమంది మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 7, 8, 9 వార్డుల్లోని 33 మంది పింఛన్లను ఓ వార్డ్ కౌన్సిలర్ భర్త తొలగించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా పాలనాధికారి శరత్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. పింఛన్లు తొలగి పోవడానికి కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన నిర్వహించారు.
ఘటన స్థలానికి ఎస్సై మధుసూదన్ రెడ్డి చేరుకొని బాధితులతో మాట్లాడి పింఛన్లు తిరిగి వచ్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించగా.. ఆందోళన విరమించారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలని బాధితులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'మాస్టర్' సినిమానూ వదలని పైరసీ భూతం!