ఈ ఏడాది మొక్కజొన్న పంటను ప్రభుత్వం వెయ్యొద్దని చెప్పినా.. కామారెడ్డి జిల్లాలో దాదాపు 33వేల ఎకరాల్లో రైతులు సాగు చేశారని కలెక్టర్ శరత్ తెలిపారు. దళారుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేస్తే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. మొక్కజొన్న క్వింటా ధర రూ.1850గా నిర్ణయించినట్లు చెప్పారు.
వచ్చే సంవత్సరం మొక్కజొన్న పంటను ఎవ్వరూ సాగు చేయవద్దని సూచించారు. రైతు సమగ్ర సర్వే ఆధారంగా మక్క సాగుచేసిన రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ గాల్ రెడ్డి, సహకార సంఘం ఛైర్మన్ భూమయ్య, సర్పంచ్ వేణు, సీఈవో నరసింహులు, జిల్లా వ్యవసాయ అధికారిని సునీత, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: అన్నదాతలను అవస్థలకు గురిచేస్తున్న సన్నరకం సాగు