ETV Bharat / state

'నిజంగా లక్ష ఉద్యోగాలిస్తే మెడలో బోర్డు వేసుకుని తిరిగెటోళ్లు' - Bandi sanjay on unemployment

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల్లో చేసిన హామీలేవి గులాబీనేతలకు గుర్తుండవని.. నిజంగానే లక్షకు పైగా ఉద్యోగాలు ఇచ్చుంటే.. కేటీఆర్ మెడలో బోర్డు వేసుకొని తిరేగేవారని ఎద్దేవా చేశారు.

'నిజంగా లక్ష ఉద్యోగాలిస్తే మెడలో బోర్డు వేసుకుని తిరిగెటోళ్లు'

author img

By

Published : Feb 25, 2021, 9:23 PM IST

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భాజపా బహిరంగ సభ ఉత్సాహంగా జరిగింది. ఈ సభలో కాంగ్రెస్ నేత మాల్యాద్రి రెడ్డి... భాజపా తీర్ధం పుచ్చుకున్నారు. మాల్యాద్రిరెడ్డికి కండువా కప్పిన బండి సంజయ్... పార్టీలోకి ఆహ్వానించారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ వివరాలపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విమర్శలు గుప్పించారు. ఒకవేళ రాష్ట్రంలో తెరాస నిజంగానే లక్షా పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేసుంటే కేటీఆర్ ఈపాటికే మెడలో బోర్డు వేసుకుని తిరిగేవాడని ఎద్దేవా చేశారు.

2018 డిసెంబర్​లో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్... రాష్ట్రంలో ఉద్యోగం లేని ప్రతి నిరుద్యోగికి రూ. 3వేలు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి రాలేదు. ప్రతి ఒక్క నిరుద్యోగికి సీఎం రూ. 72వేలు బాకీ ఉన్నడు.

-- బాన్సువాడ సభలో బండి సంజయ్

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగిన భాజపా బహిరంగ సభలో బండి సంజయ్‌, నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌ సహా మిగతా నేతలు పాల్గొన్నారు. ఈసభలో కాంగ్రెస్ నేత మాల్యాద్రి రెడ్డి... భాజపా తీర్ధం పుచ్చుకున్నారు. మాల్యాద్రిరెడ్డికి కండువా కప్పిన బండి సంజయ్... పార్టీలోకి ఆహ్వానించారు.

'నిజంగా లక్ష ఉద్యోగాలిస్తే మెడలో బోర్డు వేసుకుని తిరిగెటోళ్లు'

ఇదీ చూడండి: ఆరేళ్లలో 1,32,899 ఉద్యోగాల భర్తీ... చిత్తశుద్ధి మాకే ఎక్కువ: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.