ETV Bharat / state

కాంగ్రెస్ నేతలారా - గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇస్తారా? : బండి సంజయ్

Bandi Sanjay Sensational Comments on Congress : కాంగ్రెస్ నేతలారా.. గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇస్తారా..? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డి జిల్లా బిచ్కుందలో ఏర్పాటు చేసిన విజయ శంఖారావం కార్యక్రమానికి బండి సంజయ్ హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలిస్తే సీఎం పదవి కుమ్ములాటలతో మళ్లీ ఎన్నికలు రావడం తథ్యమన్నారు.

BJP Election Campaign
Bandi Sanjay Sensational Comments on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 15, 2023, 9:03 PM IST

Bandi Sanjay Sensational Comments on Congress : కాంగ్రెస్ నేతలారా.. గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇస్తారా..? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో విజయ శంఖారావం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా బిచ్కుందకు చేరుకున్న బండి సంజయ్.. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి ద్విచక్ర వాహన ర్యాలీగా(Two wheeler Rally) మండలంలోని పత్లాపూర్ ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు.

అనంతరం బిచ్కుంద బస్టాండ్​లో ఎన్నికల ప్రచారంలో(Election Campaign) భాగంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మధ్యంతర ఎన్నికలు తథ్యం అన్నారు. సుస్థిర ప్రభుత్వం కావాలంటే డబుల్ ఇంజిన్​తోనే సాధ్యం అన్నారు. ముస్లిం ఓట్ల కోసం మతపెద్దలంతా ప్రయత్నిస్తున్నారని.. సాధు సంతువులు, అర్చక సమాజమంతా బయటకు రావాలని పిలుపునిచ్చారు. హిందువులందరినీ ఏకం చేయండి అని కోరారు. జుక్కల్​ను చూస్తే దు:ఖమొస్తోందని.. ఇన్నాళ్ల అధికార పార్టీ నాయకుల కనుసైగల్లో మగ్గిపోయిందని ఆవేదన చెందారు.

కేంద్రం నిధులిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి - సుస్థిర ప్రభుత్వం కావాలంటే బీజేపీని గెలిపించాలి : బండి సంజయ్‌

రాజకీయ పార్టీలు పక్కన పెడదాం.. రంగు రంగు జెండాలు పక్కన పెడదాం.. కాషాయపు జెండా పట్టుకొని ఈ తెలంగాణలో ఎనభై శాతం ఉన్న హిందూ సమాజం ఒక్కటిగా కలిసి ఇక్కడ ఉన్న రజాకారులను భూస్థాపితం చేద్దాం. లేకుంటే రామరాజ్యం ఏర్పడదన్న విషయం అందరూ గుర్తుంచుకోవాలి. నేను ఆవేశంతో మాట్లాడటం లేదు.. ఈ గడ్డ కోసం ఆవేదన చెంది మాట్లాడుతున్నాను. -బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

Telangana Assembly Elections 2023 : సిట్టింగ్ ఎమ్మెల్యే అవినీతికి అంతులేదని ఆరోపించారు. ఇసుక దందాను(Sand Mafia) అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడుతారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు గెలిస్తే సీఎం పదవి కుమ్మలాటలతో మళ్లీ ఎన్నికలు రావడం తథ్యమన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలంతా కాబోయే సీఎం.. సీఎం బండి సంజయ్ అంటూ పదేపదే మిన్నంటిన నినాదాలు చేశారు. జోక్యం చేసుకుని వారించిన బండి సంజయ్.. మీరు సీఎం సీఎం అంటే నా ఉన్న పోస్ట్ కూడా ఊడిపోతది. దయచేసి సీఎం అనకండి.

బీఆర్ఎస్ లెక్క బీజేపీ కుటుంబ పార్టీ కాదు.. కాంగ్రెస్ లెక్క అర డజను సీఎంల పార్టీ కాదు.. క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎన్నికైన ఎమ్మెల్యేలు, జాతీయ నాయకత్వం(National leadership) కలిసి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారు’’అని చెప్పారు. నరేంద్రుడి సుపరిపాలనలో యావత్తు భారతదేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిందని.. కేంద్రంలో ఉన్న ప్రభుత్వ రాష్ట్రంలో ఉంటేనే న్యాయం జరుగుతుందని సంజయ్ వ్యాఖ్యానించారు. మహిళలు, ఉద్యోగులు, యువత, నిరుద్యోగులు మన బ్రతుకులు మారాలంటే రాష్ట్రంలో ప్రభుత్వం మారాలని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ నేతలారా గెలిస్తే అమ్ముడుపోబోమని గ్యారంటీ ఇస్తారా? : బండి సంజయ్

గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం - ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల ఓట్ల వేట

కేసీఆర్‌ పోలీసులతో బెదిరించి - నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేస్తున్నారు : కిషన్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.