రాష్ట్రప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కుర్ బరంగ్ఎడ్గి గ్రామంలో రూ.2.52 కోట్లతో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు ఆయన పంపిణీ చేశారు. పేదవారి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు పథకాలు అమలు చేస్త్తున్న ఎకైక సీఎం కేసీఆరేనని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, బాన్సువాడ నియోజకవర్గ తెరాస ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.