కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్లో తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రెండు ఇళ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు అప్రమత్తమై ఇంట్లో ఉన్న వారిని బయటకు తరలించారు. బిందెలతో నీళ్లు పోసి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. అప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇంట్లోని నిత్యావసర వస్తువులు, సామాగ్రి కాలి బూడిదవడం వల్ల బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇవీ చూడండి : వాన నీటిని ఒడిసిపట్టండి: సర్పంచులకు ప్రధాని లేఖ