మాజీ మంత్రి డీకే అరుణ మహిళా సంకల్ప దీక్ష చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విమర్శించారు. జిల్లాలో ఇప్పటికే 24 మద్యం షాపులను డీకే అరుణ కుటుంబ సభ్యులు నడుపుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఓవైపు మద్యం షాపులు నిర్వహిస్తూనే మద్య నిషేధంపై పోరాటం చేయటమేంటని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనం కోసమే డీకే అరుణ దీక్ష చేస్తున్నారన్నారు. గతంలో మంత్రిగా ఉన్న సమయంలోనే అత్యధికంగా దాబాలు ఏర్పాటు చేసి మద్యం సరఫరా చేసిన ఘనత అరుణకు చెందుతుందని ఎద్దేవా చేశారు. తక్షణమే గద్వాల జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే మహిళా సంకల్ప దీక్ష చేయాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: గొల్లపూడి మారుతీరావు సినీ ప్రస్థానం సాగిందిలా