జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సిందనూర్ సమీపంలో ఆర్డీఎస్ ప్రధాన కాలువకు 12వ డిస్ట్రిబ్యూటర్ వద్ద తెల్లవారుజామున గండి పండింది. కాలువలోని నీరు గండి ద్వారా పంట పొలాల్లోకి వెళ్తోంది. పొలాలు నీటిలో మునగటంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆర్డీఎస్ ప్రధాన కాలువ సిందనూర్ నుంచి మొదలు కావడంతో ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కుగా ఉంటుంది. ఈ ప్రధాన కాలువకు గండి పడటంతో నీరు వేగంగా పక్క ఉన్న పొలాలలోకి వెళ్తోంది. అధికారులు వెంటనే స్పందించి కాలువకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కడతేర్చాడు!