పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు - పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సాయుధ బలగాల రిజర్వ్ కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా సంయుక్త కలెక్టర్ నిరంజన్, అదనపు ఎస్పీ కృష్ణ, డీఎస్పీ షాకీర్ హుస్సేన్ కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమరవీరుల త్యాగానికి గుర్తుగా శిబిరాన్ని ఏర్పాటు చేశామని అదనపు ఎస్పీ కృష్ణ తెలిపారు. రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న ఒక ప్రాణాన్ని కాపాడుతుందని జేసీ నిరంజన్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండిః పోలీసుల రక్త దానం.. యువతకు ఆదర్శం
sample description