జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు గుండా ఇతర రాష్ట్రాల నుంచి వలస కార్మికులు, వాహనదారులు, విద్యార్థుల రాకపోకలు కొనసాగుతున్నాయి. మే 2 నుంచి 26వ తేదీ సాయంత్రం వరకు 20608 మందిని చెక్‌పోస్టు గుండా తెలంగాణలోకి అనుమతించినట్లు ఉండవల్లి తహసీల్దార్ లక్ష్మి తెలిపారు. వీరిలో జోగులాంబ గద్వాల జిల్లా వాసులు 1199 మంది ఉండగా, మొత్తం 7842 వాహనాలు తెలంగాణలోకి వచ్చినట్లు చెప్పారు.
మంగళవారం 620 మంది రాష్ట్రంలోకి రాగా, వీరిలో 26 మంది జోగులాంబ జిల్లాకు చెందినవారు ఉన్నారని తహసీల్దార్ వివరించారు. పోలీసులు వాహనదారుల అనుమతి పత్రాలను పరిశీలించి వివరాలు నమోదు చేసుకోగా, వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హోం క్వారంటైన్ ముద్ర వేసి అవగాహన కల్పిస్తున్నారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!