అలంపూర్ పట్టణంలో ప్రతి గురువారం సంత జరుగుతుంది. ఈ వారాంతపు సంతకు పట్టణ ప్రజలే కాకుండా పరిసర గ్రామాల ప్రజలూ వస్తారు. సింగవరం, కాశిపురం, బైరాన్‌పల్లి, ర్యాలంపాడు తదితర గ్రామాల ప్రజలు సంతకు వచ్చి నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. రోడ్డుపై నిలబడే సరుకులు కొంటున్నా.. ఇప్పటి వరకు సరైన మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం గమనార్హం.
పేద ప్రజలు ఎక్కువగా వారాంతపు సంతలపైనే ఆధారపడుతుంటారు. సంతలో సరుకులు అమ్మే వారికి కూడా సరైన సౌకర్యాలు లేవు. పంచాయతీ గేటు టోల్ రుసుము మాత్రం వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం అలంపూర్ మునిసిపాలిటీగా మారింది. అధికారులు ఇకనైనా సంత బజారుకు సరైన స్థలం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవీ చూడండి : చెక్‌పవర్ ఇవ్వట్లేదని సర్పంచ్ భిక్షాటన