దేశంలో ఎక్కడా లేనివిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి... రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. మద్దతు ధరతోనే పంటని కొంటామని తెలియజేశారు. రైతుల సంక్షేమం కోసం రైతు బీమా, రైతు బంధు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల మండలం లత్తిపురం, బీరెల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ధాన్యం కేంద్రాలకు వచ్చే ముందు రైతులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. రోజూ చేతులు శుభ్రపరుచుకోవాలని అన్నారు. ఎలాంటి అపోహలు లేకండా 45 ఏళ్లు ఉన్నవారంతా టీకా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రఘురామ శర్మ, జడ్పీ వైస్ ఛైర్మన్ సరోజమ్మ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత లేదు: మంత్రి ఈటల