ETV Bharat / state

అలంపూర్​లో మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్​

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లో బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను కలెక్టర్​ శృతి ఓజా ప్రారంభించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

maha shivaratri preparations in jogulambha temple
అలంపూర్​లో మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్​
author img

By

Published : Feb 20, 2020, 3:09 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​లోని బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను జిల్లా కలెక్టర్ శృతి ఓజా చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్​లకు ఆలయ ఈవో, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

జోగులాంబ అమ్మవారి కలెక్టర్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివరాత్రి జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.

అలంపూర్​లో మహాశివరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్​

ఇవీ చూడండి: 'టిండర్‌' ఎఫెక్ట్‌: స్నేహం పేరుతో మోసం చేసిన హైటెక్‌ కిలాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.