రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై శ్రద్ధ, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి డీకే అరుణ ఆరోపించారు. కొవిడ్-19 కట్టడి విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
'జిల్లాలో జూరాల, నెట్టెంపాడు కోయిల్‌సాగర్, తదితర ప్రాజెక్టులు ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేసిన చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయాలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని... దాని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమం' అని ఆమె హెచ్చరించారు.
ఇదీ చూడండి: ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనాతో మరో వ్యక్తి మృతి