విద్యుత్ తీగలు తగిలి మిర్చి దగ్ధమై తీవ్ర నష్టం వాటిల్లిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం సంకాపురం స్టేజీ వద్ద చోటుచేసుకుంది. సంకాపురంలో రైతులు 200 మిర్చి బస్తాలను వాహనంలో పెట్టుకుని గుంటూరుకు బయలుదేరారు.
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ తీగలు తగిలి మిర్చికి మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనలో దాదాపు 100 బస్తాల మిర్చి కాలిపోగా... సుమారు రూ.6, 7 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: మూడుసార్లు ఎమ్మెల్యే.. అయినా ఇల్లు లేదు