ETV Bharat / state

ఆటా ఆధ్వర్యంలో జాబ్ మేళా - అమెరికన్​ తెలుగు అసోసియేషన్​ తాజా వార్త

జోగులాంబ గద్వాల జిల్లా ఆముదాల పాడులో అమెరిన్​ తెలుగు అసోసియేషన్​ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు జాబ్​ మేళాను నిర్వహించారు. పుట్టిన దేశానికి ఏమైనా చేయాలనే ఉద్దేశంతో పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.

development-works-done-by-ata-in-jogulambha-gadwal
ఆట ఆధ్వర్యంలో జాబ్ మేళా
author img

By

Published : Dec 22, 2019, 5:41 PM IST

30 సంవత్సరాల క్రితం అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించి సంపాదించిన దాంట్లో కొంత మాతృదేశానికి ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో ఆట సభ్యులు ఏదో ఒక కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం చిన్న ఆముదాల పాడు గ్రామంలో ఈ సంవత్సరం జాబ్ మేళా నిర్వహించారు.

గ్రామీణ ప్రాంత ప్రజల ఎదుగుదలకై
మారుమూల ప్రాంతాలలో ఉండే విద్యార్థులకు సరైన అవకాశాలు లేక మధ్యలోనే ఆగి పోతున్నారనే ఉద్దేశంతో టాటా స్టీవ్​ స్కిల్ డెవలప్మెంట్ వారి ద్వారా కొంత మందిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చి జాబ్ చూపించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆట సభ్యులు తెలిపారు.

మాతృ గ్రామాల రుణం తీర్చుకోడానికై తపన
ఆట నిర్వహించిన జాబ్ మేళాకు జడ్పీ ఛైర్​పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, మాజీ మంత్రి డీకే అరుణ హాజరయ్యారు. పుట్టిన గ్రామాల రుణం తీర్చుకునే ఉద్దేశంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అమెరికా తెలుగు సంఘం వారిని అభినందించారు.
అనంతరం చిన్న ఆముదాల పాడు విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు, ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేశారు. అంతేకాకుండా మహిళలకు కుట్టు మిషన్ లు అందజేశారు. ప్రతిభ ఉండి చదువుకోడానికి ఇబ్బంది పడుతున్న ఓ దివ్యాంగురాలికి రూ. 15 వేల చెక్కును అందజేశారు. ఈ జాబ్​ మేళాకు భారీ ఎత్తున నిరుద్యోగులు హాజరయ్యారు.

ఆట ఆధ్వర్యంలో జాబ్ మేళా

ఇదీ చూడండి: ఆకట్టుకున్న కంబైన్డ్​ పాసింగ్​ పరేడ్​.. విమానాల విన్యాసాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.