జిల్లాలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జోగులాంబ గద్వాల కలెక్టర్ శృతి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నేడు ఆమె డ్రైరన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ను అందించారు.
టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలను అధిగమించడంతో పాటు సిబ్బందిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అందుకోసం పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
సాంకేతిక సమస్యలేవైనా తలెత్తితే.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రతి ఒక్కరికి టీకా అందించేందుకు తాము సన్నద్ధంగా ఉన్నామన్నారు.
ఇదీ చదవండి: కొవాగ్జిన్ సురక్షితమైన ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్: కృష్ణ ఎల్ల