జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం కావాలని డిమాండ్ చేశారు. తమకు శిక్షణ ఇచ్చేటప్పుడు పనికి తగ్గ పారితోషికం ఉంటుందన్నారని, ఇప్పుడు ముగ్గురు చేయాల్సిన పనిని ఒకరిపైనే వేసే ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆరోపించారు. కరోనా సమయంలోనూ విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించి సమాన పనికి సమాన వేతనం మంజూరు చేయాలని కోరారు.
గతంలో కరోనా వచ్చినప్పుడు విధులు నిర్వహించిన కాలానికి ప్రత్యేక పారితోషికం ఇస్తామని చెప్పినా.. అది నేటికీ అమలుకు నోచుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు జిల్లా వైద్యాధికారి దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోయిందని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించి న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి : ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం వాయిదా