రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రం జోగులాంబ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ సారి ప్రత్యేకంగా మహబూబ్నగర్ నుంచి వెంకటేశ్వర సేవాదళ్, శిరిడి సాయి సేవాదళ్ సభ్యులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ఈ లెక్కింపునకు రెండు రోజుల సమయం పట్టేది. సేవాదళ్ సభ్యులు పాల్గొనటం వల్ల ఒకే రోజు పూర్తయినట్లు ఆలయ ఈవో వెంకటాచారి వెల్లడించారు. ఈ విధానాన్ని ప్రతి లెక్కింపుకు కొనసాగిస్తామని తెలియజేశారు. మొత్తం రూ. 31లక్షల 61వేల 244రూపాయల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. అలాగే 48గ్రాముల బంగారం, 830 గ్రాముల వెండి, 12అమెరికన్ డాలర్లు, మలేషియన్ డాలర్ కానుకలుగా వచ్చినట్లు చెప్పారు.
ఇవీచూడండి: డిజిటల్ గద్వాల కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే