ETV Bharat / state

రైతుబంధు నిధులు స్వాహా... ఏఈఓ సస్పెండ్​ - AEO Prakash Suspended latest news

అన్నదాతలకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని కూడా అధికారులు వదలడం లేదు. పొట్టకూటి కోసం హైదరాబాద్​ నగరానికి వెళ్లిన రైతుల నిధులను తమ సొంత ఖాతాలోకి మళ్లీంచుకున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి వేల రూపాయల నిధులను మెక్కేశారు.

AEO Prakash Suspended in Jogulamba gadwal district
రైతుబంధు నిధులు స్వాహా... ఏఈఓ సస్పెండ్​
author img

By

Published : Jul 12, 2020, 12:05 AM IST

జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామానికి వ్యవసాయ విస్తరణ అధికారిగా ప్రకాష్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన కొందరు రైతులు పొట్టకూటి కోసం హైదరాబాద్​కు వలస వెళ్లారు. వీరు ఏటా రైతుబంధు డబ్బులు అడగడం లేదని గుర్తించిన ఏఈఓ ఆ డబ్బు స్వాహా చేయాలని నిర్ణయించుకున్నాడు. బ్యాంకులో రైతు ఖాతాకు బదులు తన ఖాతాను జతపరిచి ఉన్నతాధికారులకు పంపించారు.

ఐదు మంది రైతులకు చెందిన రూ.58,852 సొంత ఖాతాలోకి మళ్లీంచుకున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానం వచ్చిన అధికారులు జిల్లా కలెక్టర్​కు సమాచారం ఇచ్చారు. పాలనాధికారి ఆదేశంతో వ్యవసాయ అధికారులు విచారణ చేపట్టగా సదరు ఏఈఓ కావాలనే ఖాతా నంబర్ ఇచ్చినట్లు తేల్చారు. దీనిపై ఆగ్రహించిన కలెక్టర్ ప్రకాశ్​ను సస్పెండ్ చేశారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.