భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనంపల్లిలోని వాగులో చిక్కుకున్న రైతులను రెండు హెలికాప్టర్ల ద్వారా బయటకు తీసుకువచ్చారు. సహాయ చర్యలు ఎమ్మెల్యే గండ్ర, కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షించారు.
బావిలో ఉన్న మోటార్లను పైకి తీసేందుకు వెళ్లిన 10 మంది రైతులు వాగులో చిక్కుకున్నారు. వాగులో వరద ఉద్ధృతి పెరగడంతో చెట్టుపైకి ఎక్కి అక్కడే ఉండిపోయారు. ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రైతులను కాపాడాలంటూ గండ్ర, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు.. కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తక్షణం స్పందించిన కేటీఆర్.. ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్‌తో ఫోన్లో మాట్లాడి ఘటనా స్థలానికి ఒక హెలికాప్టర్‌ను పంపాలని సూచించారు. అప్రమత్తమైన అధికారులు రైతులను కాపాడారు.
ఇవీచూడండి: ప్రగతిభవన్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్