ఈ ఏడాది నవంబరు 1వ తేదీ నాటికి డిగ్రీ ఉత్తీర్ణులై మూడేళ్లు పూర్తి అయిన వారు మాత్రమే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. అక్టోబరు 1 నుంచి ఆన్‌లైన్‌లోనూ ఓటు హక్కు నమోదుకు పోర్టల్ అందుబాటులోకి రానుంది. 2017 అంతకు ముందు డిగ్రీ పూర్తి చేసిన వారు ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదా మార్కుల ధ్రువీకరణ పత్రం, లేదా డిగ్రీ పట్టా జిరాక్స్ పత్రాలు దరఖాస్తుకు జత చేయాలి. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు రెండు పాస్‌పోర్టుసైజ్ ఫొటోలు జత చేయాలి.
ఎలక్టోరల్ రోల్ అధికారిగా నల్గొండ డీఆర్వో..
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎలక్టోరల్ రోల్ అధికారిగా నల్గొండ డీఆర్వో వ్యవహరిస్తారు. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు సహాయ ఎలక్టోరల్ రోల్ అధికారులుగా పని చేస్తారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు జిల్లాల్లో 2,81,138 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం దాదాపు 4 లక్షల మంది ఓటు హక్కు నమోదు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఓటర్ల జాబితా షెడ్యూల్ ఇలా
- డిసెంబరు 1 ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ
- అక్టోబరు 1 ఓటర్ల నమోదు ప్రకటన జారీ
- డిసెంబరు 31 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ
- అక్టోబరు 15 ఓటర్ల నమోదు స్వీకరణ తొలి పునఃప్రకటన జారీ
- 2021 జనవరి 12 అభ్యంతరాల ఫిర్యాదుల పరిష్కారం
- అక్టోబరు 25 ఓటర్ల నమోదు స్వీకరణ మలి పునఃప్రకటన జారీ
- 2021 జనవరి 18న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
- నవంబరు 6 దరఖాస్తుల స్వీకరణ ఆఖరు తేదీ