జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని కోనరావు పేట వద్ద డీబీఎం 38 కెనాల్ కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకుని వచ్చింది. దానిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్నానానికి కాలువలోకి దిగి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. మృతదేహం ఎవరిది.. ఎక్కడి నుంచి కొట్టుకువచ్చిందన్న కోణంలో రేగొండ పోలీసులు విచారణ చేపట్టారు.
మృతుడి వయస్సు 25 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతుడి కుడి భుజం మీద పులి, అమ్మవారి పచ్చబొట్టు ఉన్నట్టు పోలీసులు నిర్ధరించారు. వివరాలు తెలిసిన వాళ్లు రేగొండ ఎస్సై 9440904679, 8978416061 నెంబర్లకు సంప్రదించగలరని తెలిపారు.
ఇవీ చూడండి: కాకతీయ కాలువలో ఎమ్మెల్యే చెల్లి, బావ, మేనకోడలి మృతదేహాలు