జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్నందున మాస్కులు ధరించని వారికి ఎస్సై వీరభద్ర రావు జరిమానా విధించారు. మండలంలో మాస్కు లేకుండా బయట తిరగుతున్న పలువురికి సోమవారం ఫైన్‌లు వేశారు.
కరోనా వైరస్ నుంచి తమను తాము కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. ఈ తనిఖీలు రోజూ కొనసాగుతాయని, మాస్కులు లేనివారిని గుర్తించి వెంటనే జరిమానా విధిస్తామని ఎస్సై హెచ్చరించారు.
ఇదీ చదవండి: 20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?