తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని తెలుగుజాతి చరిత్రలో నిలిచిపోయే రోజుగా చెప్పుకోవచ్చని... జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల తెదేపా అధ్యక్షుడు గాజ శ్రీనివాస్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని అన్నారు. మండల కేంద్రంలో పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
తెదేపా 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజల పక్షాన నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అధికారంలో ఉన్న ప్రతిసారి ప్రజాసమస్యలను పరిష్కరించి... అభివృద్ధి చేసి చూపిందన్నారు. ఇప్పటికైనా నేటి పాలకుల తీరుపై ప్రజలు ఆలోచించాలన్నారు. తెదేపా జెండా పట్టి అభివృద్ధికై ఐక్యంగా ముందుకు కదలాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: నోముల వారసుడికే నాగార్జునసాగర్ టికెట్