కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి గ్రామస్థులెవరూ ముందుకు రావడంతో.. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ఆ బాధ్యతలు చేపట్టారు. జయశంకర్ జిల్లా కేంద్రంలోని బాంబులగడ్డ శ్మశాన వాటికలో రేగొండకు చెందిన కొవిడ్ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
వైరస్‌తో మృతి చెందినవారి అంత్యక్రియలకు దూరంగా ఉండటం సమంజసం కాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలను ఆదరిస్తూ.. సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కనీసం దహనసంస్కారలైన నిర్వహించాలన్నారు. మహమ్మారి పట్ల ప్రజలందరూ జాగ్రత్త వహించాలని సూచించారు.
ఇదీ చదవండి: కరోనా సెకండ్‌వేవ్‌లో 10శాతం వరకు చిన్నారులపై ప్రభావం