రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలను పండించాలని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సూచించారు. ఆసక్తి ఉన్నవారు పామాయిల్ పంట, మిర్చి, పెసర, మినుము, కంది, పత్తి సాగు చేయాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల ప్రజాపరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
మండలంలో ఉన్న పెండింగ్ పనులు పూర్తి చేయాలి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటాం. మిషన్ భగీరథ ద్వారా అటవీ ప్రాంతాలైన కమలాపూర్, పంబాపూర్, నందిగామ గ్రామాలకు జులై 15లోపు మంచి నీటిని అందచేయాలి. ప్రభుత్వ పథకాలను అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
- ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఇదీ చదవండి: గూగుల్ పే కస్టమర్ కేర్ పేరుతో మోసం