జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించింది . ఇందుకు సంబంధించి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోగిఖర్ శివరాజు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాస కొంరయ్య.. 2020 డిసెంబరు 31న అడవిముత్తారం మండల పరిధిలోని ఓ ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. అక్కడే నిద్రిస్తున్న నాలుగేళ్ల చిన్నారిని అపహరించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అడవి ముత్తారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గతంలో కాటారం డీఎస్పీ విధులు నిర్వహించిన బోనాల కిషన్ సమగ్ర విచారణ చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జిల్లా కోర్టు న్యాయమూర్తి పి. నారా యణబాబు.. నిందితుడికి 20 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. దీనిపై వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోగిఖర్ శివరాజును, గతంలో డీఎస్పీగా పనిచేసిన బోనాల కిషన్‌ను.. త్వరితగతిన కోర్టు ట్రయల్ నిర్వహించేలా చొరవ చూపిన ప్రస్తుత కాటారం డీఎస్పీ రాంమోహన్రెడ్డిలను జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి అభినందించారు.
ఇవీ చదవండి: ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకున్న సీబీఐ అధికారులు
రంగోలీతో అతి చిన్న సాయిబాబా చిత్రం వేసిన టీచర్ ప్రపంచ రికార్డు దాసోహం