జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అర్హులకు చెక్కులను అందజేశారు. మొత్తం 66 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు, 17 మందికి సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: 'పదవులు అనుభవించారు... అభివృద్ధి మరిచారు'