కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని కన్నెపల్లి, అన్నారం పంపుల ద్వారా సుందిళ్లకు గోదావరి పరుగులు పెడుతోంది. కన్నెపల్లి పంపుహౌస్‌లో మూడు పంపుల ఆటోమేషన్ పూర్తి కాగా... మిగతా మూడు పంపుల ఆటోమేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏకకాలంలో ఆరు పంపుల ద్వారా మేడిగడ్డలో నిల్వ చేసిన గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఒక్కో పంపు నుంచి 2,300 క్యూసెక్కుల చొప్పున 13,800 క్యూసెక్కుల నీటిని అన్నారం జలాశయంలోకి తరలిస్తున్నారు.
అన్నారం పుంపుహౌస్ వద్ద మూడో పంపు విజయవంతంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు 75 గంటలకు పైగా నిరంతరంగా నీరు తరలించారు. అన్నారం జలాశయం నుంచి సుందిళ్ల ఆనకట్టకు ఒక టీఎంసీ నీటిని తరలించారు.
ఇదీ చూడండి: భవనాల కూల్చివేతకు హెచ్‌ఎండీఏ అనుమతి ఉందా?