యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పాలనాధికారి కార్యాలయంలో పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. జిల్లాలో వానకాలంలో పండించిన ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారులు గౌరీశంకర్, రాఘవేందర్, జిల్లా మార్కెటింగ్ అధికారి శేఖర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ్ భాస్కర్, జిల్లా సహకారశాఖ అధికారి రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: పీఆర్సీనీ వెంటనే ప్రకటించాలి : ఉద్యోగుల ఐక్యవేదిక